విజయవాడలో APCC రాజకీయ వ్యవహారాల కమిటీ, కార్యవర్గ సమావేశం
Loading...
Found 22 results for "PMLA"
సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌హెచ్ 65 రోడ్డు విస్తరణ పనుల నాణ్యతపై స్థానికుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా క్షేత్రస్థాయిలో నాణ్యతా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు
జహీరాబాద్‌లో గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పిఎస్ కార్యాలయంలో జాషువా చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన సాహిత్య సేవలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించారు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన మన్మోహన్ సింగ్ స్మారక పార్క్, విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, దేశ ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ పాత్రను
గద్వాలలో TRS పార్టీ జిల్లా కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొంగళ్ళ రంజిత్ కుమార్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
డీపీహెచ్‌లో స్టాఫ్ నర్సు, అటెండర్ ఉద్యోగాల పేరుతో రూ.19 లక్షల వసూళ్ల ఆరోపణలపై విచారణ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సీనియర్ అధికారి, ఇద్దరు మధ్యవర్తుల పాత్రపై ప్రస్తావన ఉంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో మహమ్మద్ వసీం (32) కత్తిపోట్లకు గురై హత్యకు గురయ్యాడు. గంజాయి వ్యాపారం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడనే కక్షతో స్నేహితులు షోయబ్, ఇలియాజ్ ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది
Change Language