Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

MOHAMMAD ASHRAF ALI

November 02, 2026 • 03:17 PM

ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక
- Advertisement -

ద్రవిడశక్తి తెలంగాణ డెస్క్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ జిల్లా నాయకులు జయరాజ్ మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోన్నయిల సంసోన్ మాదిగను ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మైసగళ్ల భూచేంద్ర మాదిగ, ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు అబ్రహం మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన మండల అధ్యక్షుడి ఎన్నిక అనంతరం వారు మాట్లాడుతూ, న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ కమిటీలతో పాటు ఎమ్మెస్ఎఫ్ విద్యార్థి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.


- Advertisement -

ఈ నెల 20వ తేదీలోపు విద్యార్థి కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, భవిష్యత్తు ఉద్యమ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం కృషి చేస్తూ, మందకృష్ణ మాదిగ సూచించిన మార్గంలో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.


ఈ సమావేశంలో జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇన్‌చార్జి ఉల్లాస్ మాదిగ, మొగుడంపల్లి మండల అధ్యక్షుడు నిర్మల్ మాదిగతో పాటు వినోద్, శరణప్ప, సుందర్, ప్రశాంత్, సుక్కప్ప, హనోక్, నిఖిల్, చిన్న, నాథనియల్, అభిరామ్, నవీన్, సునీల్, సురేష్, ప్రమోద్, సుందరాజ్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Join Group
Translate Change Language