హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య
హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య
హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. మహమ్మద్ వసీం (32) అనే వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. గంజాయి వ్యాపారానికి సంబంధించిన విషయాన్ని వసీం పోలీసులకు తెలిపాడనే అనుమానంతో అతని స్నేహితులు షోయబ్, ఇలియాజ్ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉప్పర్‌పల్లి ప్రాంతంలో వసీంపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు సంబంధించిన కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
డ్రవిడియా శక్తి — తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారంతో మీ ముందుకు.