Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

ఐటీడీఏ ఏపీవో దామోదర స్వామి సేవలు చిరస్మరణీయం ఘనంగా ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవం

Super Admin

October 01, 2026 • 03:46 PM

ఐటీడీఏ ఏపీవో దామోదర స్వామి సేవలు చిరస్మరణీయం  ఘనంగా ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవం
Image Credit / Source: “ఐటీడీఏ ఏపీవో దామోదర స్వామికి ఘన వీడ్కోలు” 33 ఏళ్ల సేవలకు సన్మానం
- Advertisement -

ఏటూరునాగారం, అక్టోబర్ 1:

ద్రవిడ శక్తి ప్రతినిధి – శివాజీ నాగరాజ్


ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (APO–General)గా సుదీర్ఘకాలం సేవలందించిన టి.వి.ఆర్. దామోదర స్వామి బుధవారం ఉద్యోగ బాధ్యతల నుంచి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఉద్యోగ పదవీ విరమణ సన్మాన మహోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.


గిరిజన ప్రాంత అభివృద్ధికి అంకితభావంతో సేవలు

దామోదర స్వామి గత 33 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ పరిధిలో వివిధ హోదాల్లో సేవలందించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO), అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (APO)గా బాధ్యతలు నిర్వహిస్తూ ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి, ఏజెన్సీ ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పలువురు వక్తలు కొనియాడారు.


విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో పాటు సహచర ఉద్యోగులు, సిబ్బందితో ఆత్మీయంగా మెలిగారని పేర్కొన్నారు.


ఉన్నతాధికారుల సమక్షంలో ఘన సన్మానం

- Advertisement -


వీడ్కోలు కార్యక్రమానికి ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదర స్వామి విధి నిర్వహణలో చూపిన అంకితభావాన్ని, క్రమశిక్షణను అభినందించారు. కార్యాలయ సిబ్బందితో ఆయనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేశారు.


అనంతరం ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ (DD–Tribal Welfare) జె. జనార్ధన్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ప్రవీణ్, ఏఓ అనిల్ కుమార్ తదితర అధికారులు దామోదర స్వామి దంపతులను పూలమాలలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.


సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు


సన్మాన గ్రహీత టి.వి.ఆర్. దామోదర స్వామి మాట్లాడుతూ తన 33 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది, గిరిజన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


అందరి సహకారంతోనే తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించగలిగానని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు.


ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన అధికారులు, సూపరింటెండెంట్లు, రెగ్యులర్ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దామోదర స్వామి పదవీ విరమణ అనంతర జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు.

- Advertisement -
Join Group
Translate Change Language