లక్ష్మి నరసింహ హాస్పిటల్ వీధిలో వైభవంగా దేవి నవరాత్రులు.. కనకదుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఘనంగా అన్నదానం!
హన్మకొండలోని లక్ష్మి నరసింహ హాస్పిటల్ వీధిలో కనకదుర్గమ్మ దేవి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించగా, సర్వకాల ప్రేమ మండలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం చేపట్టారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్