బొడ్డెమ్మ ఆడే మహిళలకు DJ సౌండ్ బాక్స్ సెట్ అందజేత
ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ సేవా కార్యక్రమం
రాయపర్తి, అక్టోబర్ 5, 2026: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో బొడ్డెమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలకు SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో DJ సౌండ్ బాక్స్ సెట్‌ను అందజేశారు.
రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు, మైలారం గ్రామంలోని 8వ వార్డుకు చెందిన మహిళలు చేసిన విన్నపం మేరకు ఈ DJ బాక్స్ సెట్‌ను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.
ఈ సందర్భంగా మహిళలు బొడ్డెమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించిన ఫౌండేషన్ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల పార్టీ నాయకులు లేతకుల రంగారెడ్డి, వార్డు నంబర్లు పరిపాటి రవీందర్ రెడ్డి, గాడిపెల్లి సునీత రాములు, మండల పార్టీ నాయకులు సంధి దేవేందర్ రెడ్డి, గుడెల్లి వెంకటయ్య, గబ్బేట యాకయ్య, పెరటి యాదవ రెడ్డి, సురేందర్ రెడ్డి, పసునూరి శ్రీనివాస్, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, బాధ సుధాకర్, చెన్నంగి తదితరులు పాల్గొన్నారు.