Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం యువ క్రాంతి బునియాద్ శిక్షణ శిబిరంలో  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి

Super Admin

October 05, 2026 • 08:44 PM

యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం యువ క్రాంతి బునియాద్ శిక్షణ శిబిరంలో  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి
- Advertisement -

ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని ప్రశ్నించే తత్వంతో ముందుకు సాగాలి



గుంటూరు: రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ‘యువ క్రాంతి బునియాద్’ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ముఖ్య అతిథిగా పాల్గొని యువ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి యువజన కాంగ్రెస్‌కు చెందిన సుమారు 70 నుంచి 80 మంది యువ నాయకులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు.



- Advertisement -

ఈ సందర్భంగా షేక్ మస్తాన్ వలి మాట్లాడుతూ.. భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడానికి ఇటువంటి శిక్షణా శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శిబిరంలో పాల్గొంటున్న ప్రతి యువ నాయకుడు ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని సూచించారు.


రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని యువ నాయకులు అలవర్చుకోవాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను బలహీనపరిచే చర్యలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశ్నిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


ప్రజలను మరింతగా కూడగట్టి వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేసే నాయకులుగా యువత ఎదగాలని షేక్ మస్తాన్ వలి ఆకాంక్షించారు. కేవలం రాజకీయ అంశాలపైనే కాకుండా.. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలు, యువత, విద్య, ఉపాధి తదితర అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లింగం శెట్టి ఈశ్వర్, గుంటూరు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు పవన్ తేజ నేతృత్వంలో మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


యువ నాయకులు శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకులుగా ఎదగాలని షేక్ మస్తాన్ వలి సూచించారు.

- Advertisement -
Join Group
Translate Change Language