పెండ్లి వెంకట్ నర్సమ్మకు నివాళులు.. కుటుంబ సభ్యులకు పరామర్శ
రాయపర్తి, అక్టోబర్ 5, 2026: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెండ్లి మల్లారెడ్డి గారి తల్లి పెండ్లి వెంకట్ నర్సమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయన్న ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వెంకట్ నర్సమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు గారే నర్సయ్య, ఐత రామ్ చందర్, పోగులకొండ వేణు, చందు సతీష్, మాజీ సర్పంచ్ గాదె రవీందర్ రెడ్డి, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు లక్కం కుమార్, సంతోష్ రెడ్డి, ఎండీ మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.