పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
జనగామ జిల్లా పాలకుర్తి గురుకుల పాఠశాలలో రాత్రి సమయంలో 14 మంది విద్యార్థినులను ఎలుకలు కరిచినట్లు సమాచారం. చేతులు, కాళ్లపై గాయాలైన విద్యార్థినులను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది