Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ

Super Admin

September 25, 2026 • 08:09 AM

పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చ
Image Credit / Source: పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
- Advertisement -

ద్రవిడ శక్తి: మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను మాజీ శాసనసభ్యులు, దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు శ్రీ వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.


పవన్ కళ్యాణ్, వంగవీటి రాధాకృష్ణల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో ఈ ఆత్మీయ భేటీ జరిగింది. ఈ సందర్భంగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను ఇరువురూ గుర్తుచేసుకున్నారు. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పలు అంశాలను వారు చర్చించుకున్నారు.



స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

- Advertisement -


భేటీలో సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.


అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలపై కూడా వంగవీటి రాధాకృష్ణ చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యలను ఆయన ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.


డ్రావిడ శక్తి వెబ్‌డెస్క్

- Advertisement -
Join Group
Translate Change Language