Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

Super Admin

September 25, 2026 • 07:53 AM

పాలకుర్తి గురుకుల పాఠశాలలో దారుణం.. 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు
Image Credit / Source: పాలకుర్తి గురుకుల పాఠశాల, ఎలుకలు కరిచిన విద్యార్థినులు, జనగామ వార్తలు, పాలకుర్తి వార్తలు, గురుకుల పాఠశాల
- Advertisement -

జనగామ జిల్లా, సెప్టెంబర్ 25:

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు హల్‌చల్ చేశాయి. గురువారం రాత్రి పాఠశాలలో నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కరవడంతో 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.


- Advertisement -

విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరిచినట్లు సమాచారం. ఘటనతో ఆందోళనకు గురైన పాఠశాల సిబ్బంది వెంటనే బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


ఒకేసారి 14 మంది విద్యార్థినులు ఎలుకల కాటుకు గురికావడంతో పాఠశాలలో కలకలం నెలకొంది. విద్యార్థినుల భద్రత, పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -
Join Group
Translate Change Language