కృష్ణమూర్తి అయ్యగారిని పరామర్శించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పరామర్శ
వరంగల్ జిల్లా, అక్టోబర్ 3:
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి అయ్యగారిని SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
కృష్ణమూర్తి అయ్యగారు ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి అయ్యగారు త్వరగా కోలుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో రాయపర్తి మండల PACS చైర్మన్ కుందూరు రామ్ చంద్రా రెడ్డి, మండల పార్టీ నాయకులు ఐత రామ్ చందర్, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, హనుమా నాయక్, పాము మనోహర్, నరేందర్, డికొండ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.