తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు
హైదరాబాద్, సెప్టెంబర్ 25:
ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ క్రేన్‌ల సహాయంతో గణనాథుడి విగ్రహాన్ని తరలిస్తూ సెక్రటేరియట్ పరిసరాలకు చేరుకున్నారు. మహా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పలు ప్రాంతాల్లో ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు.
📍 Dravidia Shakthi | Hyderabad