వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ గారు ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయి.
వీరనారి చిట్యాల ఐలమ్మ గారు చూపిన ధైర్యసాహసాలు, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం నేటి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
ఆమె పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మగౌరవాన్ని స్మరించుకుంటూ చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ద్రవిడ శక్తి ఘన నివాళులు అర్పిస్తోంది.
జై ఐలమ్మ!
జై తెలంగాణ!