Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

బీఆర్ఎస్‌లో చేరిన భార్గవ్ దేశ్‌పాండే.. అనుచరులతో కలిసి గులాబీ గూటికి

MOHAMMAD ASHRAF ALI

October 25, 2026 • 12:39 PM

బీఆర్ఎస్‌లో చేరిన భార్గవ్ దేశ్‌పాండే.. అనుచరులతో కలిసి గులాబీ గూటికి
- Advertisement -

ద్రవిడశక్తి రాజకీయ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకుడు, మాజీ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నేడు ఆయన తన అనుచరులతో కలిసి గులాబీ పార్టీలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.


కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన భార్గవ్ దేశ్‌పాండే పార్టీ మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, ప్రభుత్వ పాలనపై గతంలో ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరిక చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

భార్గవ్ దేశ్‌పాండేతో పాటు ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్‌లో చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ చేరికతో జిల్లాలో పార్టీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్తు కార్యాచరణపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.


- Advertisement -
Join Group
Translate Change Language