గణపతి మహోత్సవాల్లో పాల్గొన్న APCC వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి
శ్రీ బాల గణనాథ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో 11వ ఏకాదశ గణపతి మహోత్సవాలు
గుంటూరు: గుంటూరులోని శ్రీ బాల గణనాథ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ ఏకాదశ గణపతి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి పాల్గొన్నారు.
మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణపతి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ బాల గణనాథ యూత్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.
— DRAVIDA SHAKTHI NEWS DESK