అన్నదాత సుఖీభవ రెండో విడత ఎప్పుడు? అక్టోబర్ 17న రైతుల ఖాతాల్లో రూ.6 వేలు
దసరా కానుకగా అన్నదాత సుఖీభవ రెండో విడత విడుదల
అక్టోబర్ 17న రైతుల ఖాతాల్లో రూ.6 వేల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ కానుకగా అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత ఆర్థిక సాయాన్ని అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఇప్పటికే తొలి విడతలో రూ.7 వేల ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ కాగా, రెండో విడతలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్‌తో కలిసి నిధుల విడుదల
అన్నదాత సుఖీభవ పథకం నిధులతో పాటు పీఎం కిసాన్ పథకం కింద అందే నిధులను కూడా కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
ఇటీవల వర్షాభావ పరిస్థితులు, పంటలపై ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ఆర్థిక సాయం కొంత ఊరట కల్పించే అవకాశం ఉంది.
అక్టోబర్ 17న నిధులు విడుదల కానుండటంతో రైతుల ఖాతాల్లో జమ అయ్యే సాయంపై అధికారులు తదుపరి ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
— ద్రావిడ శక్తి వెబ్‌డెస్క్