Loading...

TRENDING
ఎమ్మార్పీఎస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడిగా సోన్నయిల సంసోన్ మాదిగ ఏకగ్రీవ ఎన్నిక కడప మేయర్ అభ్యర్థిగా షేక్ హుమేరా.. బ్యాలెట్‌లో 9వ నంబర్, గుర్తు ద్రాక్షపండ్లు ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌లకు బానిసై యువకుడి మృతి.. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ మార్పులు.. రైతులు, ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు కడప మేయర్ అభ్యర్థి షేక్ హుమేర.. సామాజిక, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సహకారం కోరుతూ విజ్ఞప్తి ఈ-సంజీవని ద్వారా 50 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లు.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ సమీక్ష.. గీసుకొండ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి.. అర్చన చౌదరి మాలిక్ ఘటనపై పోలీసుల దర్యాప్తు
BREAKING NEWS

సర్ పేరుతో ఓటు చోరికి పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం.

MOHAMMAD ASHRAF ALI

October 24, 2026 • 08:16 PM

సర్ పేరుతో ఓటు చోరికి పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం.
- Advertisement -

ఎన్నికల కేంద్ర కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి


నారాయణఖేడ్ అక్టోబర్ 24 ద్రవిడ శక్తి :

సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓటు చోరికి పాల్పడుతుందని జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని ఈరోజు నారాయణఖేడ్ లో Sir పక్రియను నిలిపి వేయాలని గ్యానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 

- Advertisement -


ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తుందన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పదవి నుండీ తొలగించాలన్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సి ఉండి ఎలక్షన్ కమిషన్ ఇవాళ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా మార్చుకొని సర్ పేరు మీద ఓట్లను తొలగించేటు వంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమం తీసుకుందన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించినట్టుగా ఇప్పటికే లెక్కలు వచ్చాయన్నారు అన్ని సర్వేలకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నారు అదే పద్ధతిలో ఓటర్ ఐడి కి కూడా ఆధార్ అనుసంధానం ఎవరి ఓటు పోకుండా ఉంటుందని కాబట్టి ఆధార్ ఒకటే లింకు చేయాలని ఇతర రకరకాల సర్టిఫికెట్లు అడగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆధార్ కార్డ్ ఒకటే అనుసంధానం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను అనేక ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని తెలిపారు.  


ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి,ఎం సి పి ఐ యు కన్వీనర్ కుమార్, బి ఎస్ పి నారాయణఖేడ్ ఇన్చార్జి పండరి,సిపిఐ నాయకులు అశోక్, కమ్యూనిస్టు లీడర్ అశోక్, అంబేద్కర్ సంఘం నాయకులు భీమ్సేన,ఎస్ ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శి స్వరాజ్ చింటూ తదితరులు ఉన్నారు

- Advertisement -
Join Group
Translate Change Language