పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ సమీక్ష
జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించడం, నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు పార్టీ నాయకులు, ఇన్‌చార్జిలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జనగామ జిల్లా | బీఆర్ఎస్ | ఎమ్మెల్సీ ఎన్నికలు | గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు